Pushpa Trailer: Movie Makers Announce Release Date, Check Details Inside - Sakshi
Sakshi News home page

Pushpa Movie Trailer: ‘పుష్ప’ మూవీ నుంచి మరో అప్‌డేట్‌, ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన మేకర్స్‌

Published Mon, Nov 29 2021 12:15 PM | Last Updated on Tue, Nov 30 2021 4:25 PM

Pushpa Movie Makers Announce Trailer Release Date On 6th December - Sakshi

Pushpa Movie Makers Announce Trailer Release Date: సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌ 1..  పుష్ప ది రైజ్ డిసెంబర్‌  17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్ మూవీకి అలియా పారితోషికమెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌ వేగం పెంచారు మేకర్స్‌. ఇప్పటికే  ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ విడుదల తేదీని ఖారారు చేస్తూ పోస్టర్‌ వదిలారు మేకర్స్‌. డిసెంబర్‌ 6న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement