విజ‌య్ వ‌ర్సెస్ టాలీవుడ్‌.. ఇప్పుడిదే ర‌చ్చ‌! | Sakshi
Sakshi News home page

విజ‌య్ వ‌ర్సెస్ టాలీవుడ్‌: ఏ హీరో యాక్టింగ్ అదిరింది!

Published Sat, Feb 24 2024 6:25 PM

Thalapathy Vijay Vs Telugu Cinema Parallels, Video Goes Viral - Sakshi

ఫ్యాన్స్ వార్ ఎప్పుడూ ఉండేదే! మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని.. మా హీరో ఇన్ని హిట్లు కొట్టాడు.. ఇంత క‌లెక్ష‌న్స్ సాధించాడు, డ్యాన్స్ ఇర‌గ‌దీస్తాడు, యాక్టింగ్ కుమ్మేస్తాడు, సేవాగుణంలోనూ మావాడిని మించినోడే లేడు.. అని డ‌ప్పు కొడుతుంటారు. ఎవ‌రి అభిమాన హీరో గురించి వారు పొగ‌డ్త‌లు చెప్పుకోవ‌డం ఓకే!

కానీ అక్క‌డితో ఆగ‌కుండా అవ‌త‌లి హీరోను తిట్టిపోస్తుంటారు. సెటైర్లు వేస్తుంటారు. సోష‌ల్ మీడియాలో ఇది స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. ముఖ్యంగా అజిత్‌, విజ‌య్ ఫ్యాన్స్ అయితే ఛాన్స్ దొరికితే చాలు క‌య్యానికి కాలు దువ్వుతారు. కానీ గ‌త కొద్దిరోజులుగా కాస్త విభిన్న‌మైన ట్రెండ్ న‌డుస్తోంది. తెలుగు సినిమా వ‌ర్సెస్ విజ‌య్ పారెలెల్స్ అంటూ అభిమానులు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఒరిజిన‌ల్ మూవీ నుంచి, దాని రీమేక్ నుంచి హీరోల డ్యాన్స్‌, యాక్టింగ్‌ వీడియోలు తీసుకుని ఎక్స్‌లో వ‌దులుతున్నారు.

కోలీవుడ్ స్టార్ విజ‌య్‌ ఒక‌పైపు.. టాలీవుడ్ హీరోలంతా మ‌రోవైపు.. ఎవ‌రి యాక్టింగ్ బాగుంది? ఎవ‌రి డ్యాన్స్ బాగుంది.. ఎవ‌రు ఇంకా న‌ట‌న‌లో ఏబీసీడీల అబ్బాయిగా క‌నిపిస్తున్నారో చూడండంటూ ఎక్స్ (ట్విట‌ర్‌)లో బోలెడు వీడియోలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కాగా విజ‌య్ న‌టించిన సుమారు 10 చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. అటు విజ‌య్ దాదాపు 8 తెలుగు సినిమాల త‌మిళ రీమేక్స్‌లో న‌టించాడు.

చ‌ద‌వండి: నా సామిరంగ‌ మూవీలో అలా చేయ‌కుండా ఉండాల్సింది.. ప‌రుచూరి రివ్యూ

Advertisement
Advertisement