ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
మంగపేట: మండలంలోని పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. మండలంలోని మంగపేట, చుంచుపల్లి, పీహెచ్‌సీలను ఏటూరునాగారం ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కోరం క్రాంతికుమార్‌తో కలిసి ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయా పీహెచ్‌సీల నిర్వహణ రికార్డులు, హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం పొందాలన్నారు. పీహెచ్‌సీలలో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. వైద్యులు, సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు జరిగేలా గర్భిణులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆస్పత్రులో మందులు, సిబ్బంది ఇతరత్రా ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో కలిసి పీహెచ్‌సీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయవ్యాధి పోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్, ఐటీడీఏ ప్రోగ్రాం మేనేజర్ మహేందర్, మంగపేట వైద్యాధికారి గౌతమ్, డాక్టర్ అఖిల, చుంచుపల్లి వైద్యాధికారి యమున, పల్లెదవాఖానా వైద్యాధికారి తరుణ్, చందా మనోజ్‌కుమార్, ఆయా పీహెచ్‌సీల సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు
Comments
Please login to add a commentAdd a comment