కొంగాల గ్రామసభలో రసాభాస | - | Sakshi
Sakshi News home page

కొంగాల గ్రామసభలో రసాభాస

Published Wed, Jan 22 2025 1:35 AM | Last Updated on Wed, Jan 22 2025 1:35 AM

కొంగాల గ్రామసభలో రసాభాస

కొంగాల గ్రామసభలో రసాభాస

బుధవారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2025

వాజేడు మండల పరిధిలోని కొంగాల గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో రసాభాస చోటుచేసుకుంది. వివిధ పథకాలకు అర్హులైన వారి వివరాలను అధికారులు చదువుతున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు పెనుమళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మరికొందరు నాయకులు గ్రామసభ వద్దకు చేరుకుని ఆరుగ్యారంటీలను అమలు చేయడం లేదని అధికారులను నిలదీశారు. ఈ సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు దాట్ల కాళీకృష్ణ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఏంటని ఎదురు ప్రశ్నించసాగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదనలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. వెంటనే ఎస్సై రాజ్‌కుమార్‌, అధికారులు ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో గ్రామసభ యధావిథిగా కొనసాగింది.

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement