రామప్పను సందర్శించిన అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా సందర్శించారు. ఆలయ ఆర్చకులు ఉమాశంకర్, రాజ్‌కుమార్‌లు ఆమెను ఆలయంలోకి ఆహ్వానించగా రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆమె పూజలు నిర్వహించారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. రామప్ప అందాలను తన సెల్‌ఫోన్‌లో బంధించుకున్నారు. అనంతరం సరస్సు కట్టను సందర్శించి బోటింగ్ చేస్తూ సరస్సు అందాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శబరీశ్, ఓఎస్డీ గీతే మహేష్, డీఎస్పీ రవీందర్, సీఐ శంకర్, ఎస్సై సతీష్‌లు పాల్గొన్నారు. అదే విధంగా రామప్ప దేవాలయాన్ని ఇటలీకి చెందిన లోరెంజో, అర్జెంటీనాకు చెందిన డేవిడ్‌లు సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment