అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలి | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలి

Published Sun, Feb 2 2025 1:42 AM | Last Updated on Sun, Feb 2 2025 1:42 AM

అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలి

అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలి

వెంకటాపురం(కె): ఏజెన్సీలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను ఉన్నతాధికారులు వెంటనే నిలిపివేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు రేగ గణేశ్‌ అన్నారు. మండల కేంద్రంలో శనివారం సంఘం సమావేశాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి కణితి వెంకటకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్‌ 68 ప్రభుత్వ భూమిలో గిరిజనేతరులు నిర్మాణాలు చేపట్టడానికి అధికారులు అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు. 1/70చట్టానికి విరుద్ధంగా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారని తెలిపారు. అలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సోడి వీరస్వామి, రేగ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement