సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు భూ సేకరణ
● పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్
ఏటూరునాగారం: సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం భూమిని సేకరిస్తున్నట్లు ఐటీడీఏ పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ తెలిపారు. ఎస్‌ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని గంగారం గ్రామంలో సర్వే నంబర్ 241లో గల భూమిని శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 241లో సుమారు 200ల ఎకరాల వరకు భూమి ఉందని తెలిపారు. అందులో 30 ఎకరాలు కుసుమ్ పథకానికి ఇచ్చేందుకు రైతులు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో కూడా సర్వే చేపట్టామన్నారు. ఐటీడీఏ, రెడ్‌కో, విద్యుత్, రెవెన్యూశాఖలు సంయుక్త సర్వే చేస్తున్నట్లు వెల్లడించారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో వచ్చే లాభాలను రైతులకు వివరించామన్నారు. ఆసక్తిగల ఉన్న రైతులు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment