రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో పతకాలు
ములుగు: ఇటీవల కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడాపోటీల్లో జిల్లాలోని పోలీసులు 9విభాగాల్లో 12మంది 12 పతకాలు సాధించారు. అదే విధంగా కాళేశ్వరం జోనల్ స్థాయి పరిధిలో జిల్లా మూడవ స్థానంలో నిలించి రికార్డు సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..400మీటర్ల రన్నింగ్ మహిళా విభాగంలో సరస్వతి, అనూష, పూజలు బంగారు పతకాలు, రెజ్లింగ్ గ్రీక్ రోమన్‌లో ఆర్‌ఎస్సై రాకేశ్ రజతం, బాస్కెట్ బాల్‌లో హరీశ్ రజతం, మిక్స్‌డ్ బ్యాడ్మింటన్‌లో అనిల్, అనూష రజత పతకాలు సాధించారు. కరాటే విభాగంలో ఆర్‌ఐ సంతోష్ కాంస్యం, రెజ్లింగ్ గ్రీక్‌రోమన్‌లో ఆర్‌ఎస్పై అశోక్ కాంస్య, బ్యాడ్మింటన్ సింగల్‌లో పీసీ అనిల్ కాంస్యం, రెజ్లింగ్ ప్రీస్టెల్‌లో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ అమిత్‌కుమార్‌సింగ్ కాంస్యం, బాక్సింగ్ విభాగంలో పీసీ వినోద్ కాంస్యం, జూడోలో ఏఆర్‌హెచ్‌సీ అమిత్‌కుమార్ సింగ్, నాగరాజులు కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీశ్‌తో పాటు ఓఎస్డీ మహేష్ బీ గీతే, డీఎస్పీ రవీందర్ పతకాలు సాధించిన వారిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment