సీడీపీఓపై చర్య తీసుకోవాలి
ములుగు: వేధింపులకు గురిచేస్తున్న వెంకటాపురం(కె) ప్రాజెక్టు సీడీపీఓ ధనలక్ష్మిపె చర్య తీసుకోవాలని కోరుతూ అంగన్‌వాడీ టీచర్లు శనివారం సాయంత్రం కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందించారు. కలెక్టర్‌ను చాంబర్‌లో కలిసి ప్రాజెక్టు పరిధిలోని పలు విషయాలను వివరించారు. అంగన్ వాడీ టీచర్ సెలవుల్లో ఉన్న సమయంలో కేంద్రానికి తనిఖీ నిమిత్తం వెళ్లి గ్రామస్తుల ఎదుట ఇష్టానుసారంగా మాట్లాడుతుందని తెలిపారు. అంగన్ వాడీ కార్యకర్త ఇంటికి వెళ్లి భర్త, పిల్లల ఎదుట అసహ్యంగా మాట్లాడుతుందని వివరించారు. కేంద్రాలకు బిల్డింగ్‌లేని చోట ఇంట్లోనే సెంటర్ నడుపుతున్నారని, ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని గతంలో ఉన్న అధికారులకు ముడుపులు అప్పజెప్పి ఇంట్లోనే నడుపుకుంటున్నారా అంటూ నీచంగా తిడుతుందని వాపోయారు. తమ సమస్యని అర్ధం చేసుకోని సీడీపీఓను ప్రాజెక్టు నుంచి పంపించి తగిన న్యాయం చేయాలని కలెక్టర్‌కు అంగన్‌వాడీలు తమ ఆవేదనను వెలిబుచ్చారు.
ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన
వెంకటాపురం(కె): సీడీపీఓ ధనలక్ష్మిని వెంటనే బదిలీ చేయాలని కోరుతూ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు శనివారం మండల కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు మాట్లాడుతూ బీఎల్‌ఓ విధుల్లో ఉన్నప్పుడు తనిఖీలకు రావడంతో పాటు కుటుంబ సభ్యుల ఎదుట దుర్భాషలాడుతుందని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే సీడీపీఓ ధనలక్ష్మిని దూర ప్రాంతానికి బదిలీ చేయాలని కోరారు.
కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేసిన అంగన్ వాడీలు
Comments
Please login to add a commentAdd a comment