అత్యాశే సైబర్ నేరగాళ్లకు ఆయుధం
ములుగు: విలాసవంతమైన వస్తువులు ఇస్తాం, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తాం, దేశీయాత్రకు పంపిస్తామని వచ్చే కాల్స్‌పై మనం చూపే అత్యాశే సైబర్ నేరగాళ్లకు ఆయుధమని సైబర్ క్రైం డీఎస్పీ సందీప్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సైబర్‌క్రైం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మనకు తెలియని ఏపీకే ఫైల్స్, లింకులు, యాప్‌లపై క్లిక్ చేయకుండా ఉండాలని సూచించారు. వ్యక్తిగత డేటాను ఎట్టి పరిస్థితిలో అపరిచితులతో పంచుకోవద్దన్నారు. ముఖ్యంగా పిరమిడ్, ఎంఎల్‌ఎం మోసాల ముప్పు పెరుగుతూ వస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ధ్రువీకరణ చేసుకోకుండా మిగతా వారి ఖాతాలలో డబ్బు జమ చేయవద్దన్నారు. ఎవరైనా మోసపోతే 1930 టోల్‌ఫ్రీ నెంబర్ లేదా వాట్సప్ నంబర్ 8712672222కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. జిల్లాలోని అన్ని పీఎస్‌లలో సైబర్ వారియర్స్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
సైబర్ క్రైం డీఎస్పీ సందీప్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment