వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. రాత్రివేళ కాస్త చలితో పాటు మంచు కురుస్తుంది.
యువత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర
ములుగు: యువత ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. జిల్లా కేంద్రంలోని టాస్క్ రీజనల్ సెంటర్ కార్యాలయంలో టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సులలో డిప్లోమా, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థులకు శిక్షణా తరగతులను కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతలో నైపుణ్యాలు పెంపొందించడానికి టాస్క్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారని తెలిపారు. టెక్నికల్ శిక్షణలో భాగంగా జావా ప్రోగ్రామింగ్, వెబ్ డెవలప్‌మెంట్, పైథాన్ ప్రొగ్రామింగ్, డేటాబేస్ అప్లికేషన్స్, సి ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, సూడో కోడ్, ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ మొదలగు కోర్స్‌లలో ఉద్యోగ మెలకువలు నేర్పిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే బ్యాకింగ్ పోటీ పరీక్షలకు సైతం శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఫోన్ నంబర్ 9618449360లో సంప్రదించాలని కోరారు.
అడవికి నిప్పు పెట్దొద్దు
● కలెక్టర్ టీఎస్.దివాకర
వాజేడు: అడవికి నిప్పు పెట్టవద్దని కోరుతూ సోమవారం మండల పరిధిలోని పెనుగోలు కాలనీ గ్రామంలో అటవీ శాఖ సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఎస్‌ఓ నాగమణి మాట్లాడుతూ ఇప్ప పువ్వులు, చీపురు సేకరించడానికి అడవి వెళ్లిన ప్రజలు చెట్లకింద కూర్చొని నిప్పు పెడితే అడవిలో మంటలు చెలరేగి అడవికి నష్టం వాటిల్లుతుందన్నారు. తునికాకు పొదలకు నిప్పు పెట్టవద్దని, ప్రూనింగ్ చేస్తేనే ఎక్కువగా ఆకులు వస్తాయని వివరించారు. అడవిలో నిప్పు మూలంగా వన్య ప్రాణులు ఆశ్రయం కోల్పోయి ఇబ్బందులు పడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment