మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
పంటక్షేత్రాల్లో పసిప్రాయం
ఎన్ని చట్టాలు వచ్చినా..బాలల జీవితాలు మారడం లేదు. పాఠశాలకు వెళ్లాల్సిన చిన్నారులు.. మిర్చితోటల్లో కూలీ పనులు చేస్తున్నారు.
– 8లోu
● ఈపక్క చిత్రంలో కనిపిస్తున్న దంపతుల పేర్లు రవి, స్వరూప. చేతిలో పాపతో ఆనందంగా కనిపిస్తున్న వీరిది స్టేషన్‌ఘన్‌పూర్. పెళ్లయిన కొన్నేళ్లకు రవికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. విషయం తెలియగానే రవి స్వరూప దంపతులు మాతృత్వానికి నోచుకోమని కుమిలిపోయారు. అధునాతన సాంకేతికతతో సంతానం పొందవచ్చని తెలుసుకుని ఫెర్టిలిటీ సెంటర్‌ను ఆశ్రయించారు. ముందుగా రవి స్పెర్మ్, స్వరూప అండాలను భద్రపర్చారు. అనంతరం రవి కీమోథెరపీ చేయించుకున్నాడు. ఆతర్వాత వారు ఐవీఎఫ్ ద్వారా పాపకు జన్మనిచ్చారు. ఇప్పుడు 8 నెలల పండంటి పాపతో ఆదంపతులు మాతృత్వపు అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. క్యాన్సర్‌ను సైతం జయించి మాతృత్వాన్ని పొందారు.
● మహబూబాబాద్‌కు చెందిన రాజేశ్, సునీత దంపతులకు ఐదేళ్ల కిందట వివాహమైంది. రెండేళ్ల క్రితం అతడికి వృషణ క్యాన్సర్‌గా నిర్ధారణ అయ్యింది. చిన్న వయస్సులోనే క్యాన్సర్ రావడంతో తల్లిదండ్రులయ్యే అవకాశం లేదంటూ.. మానసికంగా కుమిలిపోయారు. టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో చూసి హనుమకొండలోని ఓ ఫెర్టిలిటీ సెంటర్‌ను ఆశ్రయించారు. రాజేశ్ కీమో థెరపీకి వెళ్లే ముందు స్పెర్మ్, సునీత అండాలను భద్రపర్చారు. ఆ తర్వాత ఐవీఎఫ్ ద్వారా వారికి ప్రస్తుతం పాప జన్మించింది. క్యాన్సర్ ఉన్నప్పటికీ తల్లిదండ్రులు కావడంతో వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.
Comments
Please login to add a commentAdd a comment