పకడ్బందీగా సమగ్ర కుటుంబ సర్వే
● నిర్ణీత
గడువులోగా
హౌస్ లిస్టింగ్
ప్రక్రియను పూర్తి
చేయాలి
● కలెక్టర్ బదావత్ సంతోష్
తాడూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. తాడూరు మండలం శిర్సవాడలో గురువారం హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి స్టిక్కర్ అతికించడం, కుటుంబ యజమాని పేరు, వివరాల నమోదుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్యుమరేటర్లు నిర్దేశిత సర్వే ప్రణాళికను అనుసరిస్తూ హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు హౌస్ లిస్టింగ్.. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఇక్కడ ఇల్లు ఉండి, ఇతర జిల్లాలో నివాసం ఉండే వారు స్వేచ్ఛగా ఎక్కడో చోట మాత్రమే వివరాలు నమోదు చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్యుమరేషన్ బ్లాక్‌లోని ప్రతి ఇంటికీ క్రమ సంఖ్య కేటాయించాలని.. ఇళ్ల జాబితా పక్కాగా రూపొందిస్తే, సర్వే అంత సమగ్రంగా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఎన్యుమరేటర్లు ఇంకా అవసరమైతే అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. సర్వేకు సంబంధించిన ఫారాలను భద్రపరిచేందుకు అవసరమైన ఫైళ్లు, బ్యాగులను ఎన్యుమరేటర్లకు అందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment