సిర్సవాడలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించి, ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులు, సిబ్బంది సూచించారు. జిల్లావ్యాప్తంగా 253 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసారి సన్నాలు, దొడ్డురకం ధాన్యం సేకరణకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచామని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట పౌరసరఫరాలశాఖ అధికారులు శ్రీనివాస్, రాజేందర్, తహసీల్దార్ కిరణ్మయి, ఎంపీడీఓ బ్రహ్మచారి, సింగిల్‌విండో చైర్మన్ రాంచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ రాజేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రమేశ్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment