వాతావరణం
అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతం అవుతుంది. ఉదయం, రాత్రివేళ చలి విపరీతంగా ఉంటుంది.
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నాగర్‌కర్నూల్: ప్రజావాణి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మొత్తం 39 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
పోలీస్ ప్రజావాణికి తొమ్మిది అర్జీలు..
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి తొమ్మిది అర్జీలు అందాయి. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకొని ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మూడు ఫిర్యాదులు తగున్యాయం కోసం రాగా.. ఐదు భూతగాదాలపై, ఒకటి భార్యాభర్తల గొడవపై వచ్చినట్లు తెలిపారు.
తప్పులకు తావివ్వొద్దు
అచ్చంపేట: సమగ్ర కుటుంబ సర్వే వివరాల నమోదులో తప్పులకు తావివ్వొద్దని మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ ఎన్యుమరేటర్లకు సూచించారు. సోమవారం పట్టణంలో చేపట్టిన ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ప్రణాళికా బద్ధంగా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికీ వెళ్లి సమగ్ర వివరాలు సేకరించాలని సూచించారు. సర్వేపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రజలు ఇచ్చే సమాధానాలను మాత్రమే నమోదు చేసుకోవాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment