నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
కల్వకుర్తిరూరల్: నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మె ల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మార్చాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు గదులు, గౌడ సంఘం భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఉన్నత పాఠశా ల విద్యార్థుల కోసం కంప్యూటర్లను అందజేశారు. అ నంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రానికి రైతులు తీసుకువచ్చిన ధాన్యంలో తేమశాతాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రైతులు ని బంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గంలో ని అన్ని గ్రామాలు, తండాలకు బీటీరోడ్లు, సీసీరోడ్లు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ మెంబర్ సభ్యుడు బాలాజీ సింగ్, పీఏసీఎస్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, విజయ్‌కుమార్‌రెడ్డి, సీఈఓ వెంకట్‌రెడ్డి, రవిగౌడ్, జంగయ్యగౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment