ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు
● విద్యార్థులకు
మెనూ ప్రకారం
భోజనం
అందించాలి
● కలెక్టర్
బదావత్ సంతోష్
అధికారులు పర్యవేక్షించాలి..
జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు సీతారామారావు, దేవ సహాయంలతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారం అందించాలన్నారు. గురుకులాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. హాస్టళ్లకు సరఫరా అవుతున్న బియ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. వంట మనుషులు బియ్యాన్ని శుభ్రంగా కడిగి వండాలని తెలిపారు. ఎప్పటికప్పుడు తాజా కూరగాయలు ఉండేలా చూడాలని.. పాడైన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దన్నారు. గుడ్లను జాగ్రత్తగా పరిశీలించి, నాణ్యమైన వాటినే విద్యార్థులకు అందించాలని తెలిపారు. వంట సరుకులకు తేమ తగలకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యార్థులతో ఫుడ్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. వండిన ఆహారాన్ని అధికారులు పరీక్షించిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని కలెక్టర్ తెలియజేశారు. హాస్టళ్లలో చేపట్టాల్సిన పనులు, పిల్లలకు అవసరమైన ఇతర మౌలిక వసతులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ముఖ్యంగా నీటి నిల్వలు, మరుగుదొడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ సమస్యలు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో కేజీవీబీ, సీడీపీఓ అధికారులు, రెసిడెన్షియల్ పాఠశాలల డీసీఓలు, హాస్టళ్ల వార్డెన్లు ఉన్నారు.
నాగర్‌కర్నూల్: గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని.. మెనూ, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ బదావత్ సంతోష్ హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రం సమీపంలోని ఉయ్యాలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థుల కోసం తయారు చేసిన మధ్యాహ్న భోజనంతో పాటు గురుకులానికి సరఫరా చేసిన బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. మెడికల్ కిట్స్, మందులు, కనీస అవసరాలు అందుతున్న విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని స్టోర్ రూంను పరిశీలించారు. స్టోర్ రూంలో శుభ్రత పాటిస్తూ.. సరుకులను క్రమపద్ధతిలో అమర్చుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులు నిద్రించే డార్మెంటరీ హాల్‌తో పాటు స్టడీ రూంను సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి సూచించారు. గురుకులాల్లో బాధ్యత గల ఫుడ్ సూపర్‌వైజర్, విద్యార్థుల మెస్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు వండిపెట్టే బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు నాణ్యతగా ఉండాలన్నారు. స్టాక్ రిజిస్టర్, డైలీ రిజిస్టర్ ఖచ్చితంగా నిర్వహించాలని.. ఆహార పదార్థాలు వచ్చినప్పుడు ఫుడ్ సూపర్‌వైజర్, మెస్ కమిటీ సభ్యులు పరిశీలించినట్లుగా సంతకాలు తీసుకోవాలని తెలిపారు. ఆహారం నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్నారు. బియ్యం లేదా కూరగాయలు నాణ్యతగా లేకుంటే తిరిగి పంపించాలని సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment