రాజీ మార్గంతో సమయం ఆదా
నాగర్‌కర్నూల్ క్రైం: రాజీ మార్గం ద్వారా చిన్నచిన్న కేసులను పరిష్కరించుకోవడం వల్ల ఇరు వర్గాలకు సమయం, డబ్బు ఆదా అవుతాయని.. డిసెంబర్ 14న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి రాజేష్‌బాబు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్‌అదాలత్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. జాతీయ లోక్‌అదాలత్‌లో కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకునేలా పోలీసులు, ఎకై ్సజ్‌శాఖ, న్యా యవాదులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. జిల్లాలోని న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులకు సంబంధించి సకాలంలో విట్‌నెస్‌లను తీసుకురావాలని.. అందుకోసం సమన్లు జారీ చేయాలని సూచించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన టోల్‌ఫ్రీ నంబర్ 15100 ద్వారా ఉచితంగా న్యాయసేవలు పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లైంగిక వేధింపులకు గురయ్యే వారు ఫిర్యాదు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తి స్తే కమిటీకి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. న్యా యమూర్తులు సబిత, మౌనిక, శ్రీనిధి, ఏఎస్పీ రామేశ్వర్, ఎకై ్సజ్ ఈఎస్ గాయత్రి ఉన్నారు.
వచ్చేనెల 14న జాతీయ లోక్‌అదాలత్
కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా జడ్జి రాజేష్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment