అడ్డు తొలగేనా..?!
ప్రధాన అడ్డంకిగా మారిన భూసేకరణ ప్రక్రియ
●
పనుల వేగవంతానికి చర్యలు..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పెండింగ్ పనుల కోసం భూసేకరణ ప్రక్రియ విడతల వారీగా కొనసాగుతోంది. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ వేగవంతం చేసేందుకు రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల సమన్వయంతో కృషి చేస్తున్నాం. వారానికో సారి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తాం.
– సీతారామారావు, అడిషనల్ కలెక్టర్
మార్కండేయ, అచ్చంపేట
ఎత్తిపోతలకు సైతం..
సుమారు 7 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు బిజినేపల్లి మండలం శాయినిపల్లి వద్ద చేపట్టిన మార్కండేయ ప్రాజెక్టుకు భూసేకరణ పూర్తికాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే సమీపంలో 14 గ్రామాలు, తండాల రైతులకు సాగునీరు అందనుంది. అచ్చంపేట బ్రాంచ్ కెనాల్ విస్తరణ ద్వారా ఉప్పునుంతల మండలం వరకు సుమారు 15 వేల ఎకరాలకు సాగునీరు అందేలా చేపట్టిన పనులు సైతం భూసేకరణ అడ్డంకితోనే ప్రారంభానికి నోచుకోవడం లేదు.
సాక్షి, నాగర్‌కర్నూల్: మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం విస్తరణ పనులు సుమారు 20 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేసేందుకు భూసేకరణ ప్రక్రియ ప్రధాన సమస్యగా మారింది. భూములు కోల్పోతున్న రైతులకు సకాలంలో న్యాయమైన పరిహారం అందించాల్సి ఉండగా.. ఏళ్ల తరబడి తీవ్ర జాప్యం కొనసాగుతోంది. భూసేకరణ పూర్తయిన చోట ఇప్పటికీ పరిహారం అందక రైతులు నిరీక్షిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల కన్నా ముందుగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను పూర్తిస్థాయిలో చేపట్టాలని నిర్ణయించింది. ప్రాధాన్యతా క్రమంలో కేఎల్‌ఐతో పాటు మార్కండేయ, అచ్చంపేట ఎత్తిపోతల, డిండి, ఎస్‌ఎల్‌బీసీ ఎత్తిపోతల పథకాల పనులను పూర్తిచేసి, సాగునీటి సరఫరా ప్రారంభించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. అయితే అందుకు అత్యంత కీలకమైన భూసేకరణ పనుల్లో మాత్రం పురోగతి ఉండటం లేదు.
ముందుకు సాగని ఎంజీకేఎల్‌ఐ
పెండింగ్ పనులు
ప్యాకేజీ 29, 30 విస్తరణకు
పూర్తికాని 143 ఎకరాల భూసేకరణ
రైతులకు నష్టపరిహారం
అందించడంలో తీవ్ర జాప్యం
ఏళ్లుగా పూర్తి ఆయకట్టుకు
అందని సాగునీరు
Comments
Please login to add a commentAdd a comment