విద్యాభివృద్ధికి కృషి
చారకొండ/లింగాల: రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. సోమవారం చారకొండ కేజీబీవీ కళాశాలలో రూ. 3.25 కోట్లతో అదనపు గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. లింగాల మండలం ఎర్రపెంటలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్మించిన మల్టీపర్పస్ భవనాన్ని ప్రారంభించారు. శ్రీరంగాపూర్, కొత్తచెర్వుతండాలో గ్రామపంచాయతీ భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీల అమలుతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసేందుకు బీఆర్‌ఎస్, బీజేపీలు ఉద్దేశ పూర్వకంగా అసత్యపు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమాల్లో జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ బాలాజీ సింగ్, సింగిల్‌విండో చైర్మన్ గురువయ్య గౌడ్, తహసీత్దార్ సునీత, ఎంపీడీఓలు ఇసాక్ హు స్సేన్, ఆంజనేయులు, ఎంపీఓ వెంకటేష్, ఎంఈఓ ఝాన్సీరాణి, నాయకులు వెంకటయ్య యాదవ్, వెంకట్ గౌడ్, బాల్‌రాంగౌడ్, శ్రీనివాసరావు, నాగేశ్వర్‌రావు, విజేందర్‌గౌడ్, నరే ష్ నాయక్, ప్రశాంత్, మహేష్ పాల్గొన్నారు.
రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమం
నాగర్‌కర్నూల్‌రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించేందుకు అందరూ సిద్ధం కావాలని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వార్ల వెంకటయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు, వ్యవసాయ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంటలు కోతలకు రాకముందే ముందస్తు వ్యాపార లావాదేవీలతో పంటలను స్వాధీనం చేసుకొని రైతులకు నష్టం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్రం విధానాలను ఎండగట్టాలన్నారు. సమావేశంలో శివశంకర్, చంద్రమౌళి, కృష్ణాజీ, బాలమురళీకృష్ణ, రవీందర్, ఏసయ్య, కిరణ్‌కుమార్, శంకర్, శ్రీనివాసులు ఉన్నారు.
కొర్రీలు లేకుండా
పత్తిని కొనాలి
తాడూరు: సీసీఐ కేంద్రాలకు రైతులు తీసుకువచ్చే పత్తిని ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని మణికుంఠ జిన్నింగ్ మిల్లులో ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రాబంద్‌లా మారిందన్నారు. ఒకవైపు రైతులు పండించిన పంటలను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. ప్రభుత్వం విజయోత్సవాలను జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్ర బాగుంటుందన్నారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వకపోవడమే కాకుండా సకాలంలో కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు ఎండీ సమ్మద్ పాషా ఉన్నారు.
రేపు పీయూలోఇండక్షన్ కార్యక్రమం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు బుధవారం ఇండక్షన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీయూ ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ చాన్స్‌లర్ జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ చెన్నప్ప హాజరవుతారన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment