No Headline
సోమశిల కృష్ణా పుష్కరఘాట్లో..
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. శ్రీశైలం ఉత్తర ద్వారమైన శ్రీఉమామహేశ్వరంలో స్వామి, అమ్మ వార్లకు అర్చనలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, పల్లకీ సేవ నిర్వహించారు. మొక్కుబడి ఉన్న భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. అదే విధంగా సోమశిల సోమేశ్వరాలయం భక్తులతో కిక్కిరిసింది. కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం కృష్ణా పుష్కరఘాట్తో పాటు దేవాలయ ఆవరణలో మహిళలు పెద్ద సంఖ్యలో కార్తీక దీపాలు వెలిగించారు. సోమేశ్వరాలయంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుని పునీతులయ్యారు.
– అచ్చంపేట/కొల్లాపూర్ రూరల్
భక్తిశ్రద్ధలతో కార్తీక దీపారాధన
Comments
Please login to add a commentAdd a comment