ప్రజావాణి అర్జీలపై సత్వరమే స్పందించాలి
నాగర్కర్నూల్: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే అర్జీలపై సంబంధిత అధికారులు సత్వరమే స్పందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని సూచించారు. సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యల వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ప్రజావాణిలో 43 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment