శ్రీపాల్‌రెడ్డి గెలుపు చారిత్రక అవసరం
నల్లగొండ: ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి గెలుపు చారిత్రక అవసరమని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు డీవీఎస్ ఫణికుమార్, ప్రధాన కార్యదర్శి మేకల జాన్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని పీఆర్టీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల బిల్లులను డిసెంబర్ 16లోగా పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. గురుకులాలకు టైం స్కేల్ అమలు చేయాలని మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయులకు 010 ద్వారా వేతనాలు ఇవ్వాలన్నారు. మాజీ అధ్యక్షుడు భిక్షంగౌడ్ మాట్లాడుతూ పీఆర్టీయూ అభ్యర్థి గెలుపునకు ఈసారి అందరూ సమష్టిగా కృషి చేస్తారన్నారు. పీఆర్టీయూపై తీన్మార్ మల్లన్న విషం చిమ్ముతున్నారన్నారు. బీసీలు.. రెడ్లకు ఓటేయవద్దంటూ పీఆర్టీయూలో చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాస్, శంకరయ్య, గాదె వెంకట్‌రెడ్డి, తిరందాసు సత్తయ్య, యూసుఫ్పాష, నాగయ్య, వీరమల్ల శ్రీను, రమణ, కత్తుల భాస్కర్ పాల్గొన్నారు.
ఫ పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డీవీఎస్ ఫణికుమార్
Comments
Please login to add a commentAdd a comment