సీఎం హోదాలో రెండోసారి.. | - | Sakshi
Sakshi News home page

సీఎం హోదాలో రెండోసారి..

Published Fri, Nov 8 2024 2:09 AM | Last Updated on Fri, Nov 8 2024 2:09 AM

సీఎం

సీఎం హోదాలో రెండోసారి..

నేడు యాదాద్రి జిల్లాకు రేవంత్‌రెడ్డి రాక

సంగెం బ్రిడ్జి నుంచి భీమలింగం కత్వవరకు మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్ర

రైతులు, చేతివృత్తిదారులతో మమేకం

యాదాద్రీశుడి సన్నిధిలో కుటుంబ సమేతంగా పూజలు

సీఎం పర్యటన షెడ్యూల్‌..

● ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట్‌ విమానాశ్రయం నుంచి

సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రికి

బయలుదేరుతారు.

● 9.20కి యాదాద్రి కొండ దిగువన ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుని అక్కడినుంచి ప్రెసిడెన్షియల్‌ సూట్‌కు వెళ్తారు.

● 9.30 నుంచి 10గంటల వరకు ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో ఉంటారు.

● 10 గంటలకు ప్రెసిడెన్షియల్‌ సూట్‌ నుంచి యాదాద్రి ఆలయానికి బయల్దేరుతారు.

● 10.05 నుంచి 11.15 గంటల వరకు ప్రధానాలయంలో ఉంటారు. ఈ సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

● 11.20కి ప్రెసిడెన్షియల్‌

సూట్‌కు చేరుకుంటారు.

● 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో వైటీడీఏ, దేవస్థానం అధికారులతో సమావేశమై ఆలయ అభివృద్ధిపై సమీక్షిస్తారు.

● ఒంటిగంట నుంచి 1.30 గంటల వరకు భోజన విరామం.

● 1.30కి ప్రెసిడెన్షియల్‌ సూట్‌ నుంచి బయలుదేరి సంగెం చేరుకుంటారు.

● 2.10 నుంచి 3 గంటల వరకు సంగెం బ్రిడ్జిపైనుంచి మూసీ వెంబడి భీమలింగం కత్వ వరకు 2.5 కిలో మీటర్లు పాదయాత్ర చేస్తారు. తిరిగి అక్కడి నుంచి సంగెం వరకు పాదయాత్రగా వస్తారు. అక్కడ ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.

● 5 గంటలకు సంగెం నుంచి తిరిగి హైదరాబాద్‌కు రోడ్డుమార్గంలో బయలుదేరి వెళ్తారు.

సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టనున్న మూసీ పునరుజ్జీవన సంకల్పయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం వలిగొండ మండలం సంగెం బ్రిడ్జి వద్ద నుంచి మూసీ వెంబడి భీమలింగం కత్వవరకు 2.5 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. తిరిగి అక్కడినుంచి సంగెం వరకు పాదయాత్రగా వస్తారు. ఈ క్రమంలో మూసీ పరీవాహక ప్రాంత రైతులు, చేనేత, మత్స్యకార్మికులతో పాటు వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడుతారు. మూసీ కలుషిత జలాల కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటారు. ఈ సందర్భంగా సంగెం వద్ద నిర్వహించే సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. అంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌ ద్వారా బయలుదేరి 9.20కి యాదాద్రి కొండ దిగువన ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో ప్రెసిడెన్షియల్‌ సూట్‌కు వెళ్తారు. తిరిగి ప్రెసిడెన్షియల్‌ సూట్‌ నుంచి పలువురు మంత్రులతో కలిసి యాదాద్రి కొండపైకి చేరుకుంటారు. అక్కడ విష్ణు పుష్కరిణిలో సీఎం, కుటుంబసభ్యులు స్నాన సంకల్ప పూజలో పాల్గొంటారు. ఆ తరువాత అఖండ దీపారాధన చేసి మొక్కులు తీర్చుకుంటారు. అక్కడి నుంచి తూర్పు రాజగోపురం ద్వారా ప్రధానాలయంలోకి వెళ్తారు. క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే ముఖమండపంలో అష్టోత్తర పూజల్లో పాల్గొంటారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయనున్నారు. అక్కడి నుంచి సీఎం, కుటుంబ సభ్యులు అద్దాల మండపం చేరుచేరుకుని అధికారులు అందజేసే శ్రీస్వామి వారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అనంతరం తిరిగి ప్రెసిడెన్షియల్‌ సూట్‌ వెళ్తారు.

వైటీడీఏ అధికారులతో సమీక్ష

ప్రెసిడెన్షియల్‌సూట్‌లో 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు వైటీడీఏ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. యాదాద్రి పెండింగ్‌ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు. భోజన విరామం అనంతరం రోడ్డు మార్గంలో భువనగిరి మీదుగా సంగెం చేరుకుంటారు. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగ, పార్టీ నాయకత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది.

మొదటిసారి మార్చి 11న

రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు రెండోసారి వస్తున్నారు. ఈ ఏడాది మార్చి 11న కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అదే రోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరిగి శుక్రవారం మరోసారి జిల్లాకు వస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సీఎం హోదాలో రెండోసారి..1
1/2

సీఎం హోదాలో రెండోసారి..

సీఎం హోదాలో రెండోసారి..2
2/2

సీఎం హోదాలో రెండోసారి..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement