గోదావరి నీళ్లతో సస్యశ్యామలం
గోదావరి నీళ్లతో ఆలేరు సస్యశ్యామలం అవుతుందని రాష్ట్ర మంత్రులు తుమ్మల,కోమటిరెడ్డి అన్నారు.
- 8లో
మూసీ ప్రాజెక్టు కింద
30వేల ఎకరాల ఆయకట్టు
కేతేపల్లి : సూర్యాపేట మండలం సోలిపేట వద్ద నిర్మించిన మూసీ ప్రాజెక్టు ప్రధాన కుడి, ఎడమ కాల్వల పరిధిలో ప్రస్తుతం 30వేల ఎకరాల్లో వరి పంట సాగవుతోంది. కుడికాల్వ నల్లగొండ జిల్లా పరిధిలో 24 గ్రామాల్లో 14,770 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఎడమ కాల్వ కింద సూర్యాపేట జిల్లాలోని 18 గ్రామాల్లో 15,230 ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతోపాటు 40 చెరువులు, కుంటలను మూసీ నీటితో నింపుతుండటంతో అదనంగా వేల ఎకరాలకు సాగునీరందుతుంది. వేలాది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. మూసీ జలాలు కలుషితం కావడం వల్ల మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గినప్పుడు రసాయనాలు నీటిలో తేలుతాయి. నీరు పచ్చగా మారుతుంది.
గతంలో సూర్యాపేటకు తాగునీరు
ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పటి నుంచి సూర్యాపేట పట్టణానికి రోజూ 10 క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాల కోసం విడుదల చేసేవారు. మూసీ నీరు కాలుష్యంగా మారటంతో పదేళ్ల నుంచి పంపింగ్ నిలిపివేశారు. పాలేరు రిజర్వాయర్ నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
మూసీనదిపై ఆనకట్టలు, చెక్‌డ్యాంలు, ప్రాజెక్టులు కలిపి 20 ఉన్నాయి. వాటిలో 17 ఆనకట్టలు, రెండు చెక్‌డ్యాంలు, ఒక ప్రాజెక్టు(మూసీ) ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment