కలెక్టర్ ఇంటికి స్టిక్కరింగ్
నల్లగొండ టూటౌన్: సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజ కీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే బృందం గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎన్యుమరేటర్ ఆయేషా హమీరా.. కలెక్టర్ త్రిపాఠి ఇంటి నంబర్, ఇంటి యజమాని వివరాలను అడిగి తెలుసుకొని స్టిక్కర్‌పై నమోదు చేసి కలెక్టర్ నివాస గృహం గోడకు అతికించారు. వార్డు, బ్లాక్ తదితర కోడ్ నంబర్లు నమోదు చేసుకున్న అనంతరం పూర్తి వివరాలను ఎప్పుడు సేకరిస్తారని కలెక్టర్ ఎన్యుమరేటర్‌ను ప్రశ్నించగా.. ఈనెల 9వ తేదీ నుంచి మరోసారి ఇళ్లను సందర్శించి పూర్తి వివరాలు సేకరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి ఎన్యుమరేటర్‌తో ఉన్న స్టిక్కర్, మ్యాప్, ఐడీకార్డ్, ఇతర ఫారాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్, సూపర్వైజర్ రోహిత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment