పునరుజీ్జవంతోనే మనుగడ
మురికి కూపంగా మూసీ నది
ఫ పరిశ్రమల రసాయనాలు, మానవ వ్యర్థాలతో విషతుల్యం
ఫ కలుషితమవుతున్న భూగర్భ జలాలు
ఫ ఇక్కడ పండించిన పంటలు తిన్నా, నీటిని తాగినా ఆరోగ్య సమస్యలు
ఫ కీళ్లు, చర్మ, మూత్రపిండాలు, గర్భకోశ వ్యాధుల బారిన జనం
ఫ పశువుల పాలూ కలుషితమే
ఫ చేతివృత్తులపైనా ప్రభావం
మూసీ నది
జీవంపోసిన జీవనదే.. జీవనానికి ముప్పుగా పరిణమించింది. స్వచ్ఛమైన నీటిని అందిస్తూ వ్యవసాయం, పాడి, మత్స్య సంపదకు నెలవైన మూసీ.. విషతుల్యంగా మారింది. ఒకప్పుడు మూసీలో రూపాయి బిళ్ల వేస్తే స్పష్టంగా కనిపించేదని నాటితరం పెద్దలు చెబుతుంటారు. 1930 వరకు హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల దాహార్తి తీర్చింది. గడిచిన 30 సంవత్సరాలుగా రసాయన పరిశ్రమలు, మానవ వ్యర్థాలు మూసీ పరీవాహకంలో జీవన విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి.
–సాక్షి, యాదాద్రి, శాలిగౌరారం
భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి వద్ద కాలుష్యపు నురగలు కక్కుతున్న మూసీనది
కృష్ణా నదికి ఉపనదిగా ఉన్న మూసీ అసలు పేరు ముచుకుందా. ముచుకుందుడు అనే రాజర్షి పేరు మీదుగా ముచుకుందా నదిగా పేరు వచ్చింది. అది కాలక్రమేణా మూసీ నదిగా మార్పు చెందింది. మూసీనది హైదరాబాద్‌కు పశ్చిమ వైపున 90 కిలోమీటర్ల దూరంలో నేటి వికారాబాద్ జిల్లా(నాటి రంగారెడ్డి జిల్లా)లోని అనంతగిరి కొండల్లో పుట్టింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల మీదుగా 240 కిలో మీటర్ల దూరం ప్రవహించి నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి(నాటి వజీరాబాద్) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.
● మూసీ పరీవాహక ప్రాంత (బేసిన్)
వైశాల్యం 4,329 చదరపు మైళ్లు.
(ఇది కృష్ణానది వైశాల్యంలో 4.35 శాతం)
Comments
Please login to add a commentAdd a comment