దళారులు తెచ్చిన పత్తే కొంటున్నారు! | - | Sakshi
Sakshi News home page

దళారులు తెచ్చిన పత్తే కొంటున్నారు!

Published Mon, Nov 11 2024 1:41 AM | Last Updated on Mon, Nov 11 2024 1:41 AM

దళారులు తెచ్చిన పత్తే కొంటున్నారు!

దళారులు తెచ్చిన పత్తే కొంటున్నారు!

మునుగోడు: మునుగోడులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రాల్లో దళారుల హవా నడుస్తోందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రారంభించిన ఈ సీసీఐ కేంద్రాల్లోకి కొందరు వ్యాపారులు బినామీ రైతుల పేరు మీద పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, డీసీఎంలలో పత్తిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ అధిక లాభాలు పొందుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే సీసీఐ కేంద్రాల వద్దకు వచ్చి పడిగాపులు కాయలేక తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని రైతులు, రైతు సంఘాల నాయకులు వాపోతున్నారు.

16,255 క్వింటాళ్ల పత్తి కొనుగోలు

చండూరు వ్యవసాయ మార్కెట్‌ పరిధిలోని నాలుగు జిన్నింగ్‌ మిల్లుల్లో ఇప్పటి వరకు సీసీఐ అధికారులు మొత్తం 661 మంది రైతుల నుంచి 16,255 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ఇందులో దాదాపు సగానికిపైగా దళారులు కొనుగోలు చేసి బినామీ రైతుల పేర్లతో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్మారు. అలాగే మునుగోడు మండలంలోని మూడు జిన్నింగ్‌ మిల్లులు ఉండగా రెండు మిల్లుల్లో దళారులు తీసుకొచ్చిన పత్తినే అధికంగా కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం ఆ మిల్లుల్లో పనిచేస్తున్న సిబ్బంది దళారులతో కుమ్మకై ్క ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అధికంగా దళారులు తెత్చిన పత్తినే దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు మునుగోడు మండలంలోని సలాసర్‌ బాలాజీ జిన్నింగ్‌ మిల్లులో 5,249 క్వింటాళ్లు, జైబింద్‌ జిన్నింగ్‌ మిల్లులో 4,116, కార్తికేయ కాటన్‌ మిల్లులో 5,680 క్వింటాళ్లు, చండూరులోని మంజీత్‌ జిన్నింగ్‌ మిల్లులో 1,208 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేశారు.

దళారులు అమ్ముతుందిలా..

రెండు మిల్లుల్లో పనిచేస్తున్న సిబ్బంది సీసీఐ, మార్కెట్‌ అధికారులను మచ్చిక చేసుకుని ఆ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు అంతా వాళ్లే కొనసాగిస్తున్నారు. ఆ సిబ్బందితో పాటు కొందరు వ్యాపారులు నారాయణపురం, మర్రిగూడ, చిట్యాల, మునుగోడు మండలాల్లోని రైతుల నుంచి క్వింటాల్‌ రూ.6,500 నుంచి రూ.6,700 వరకు కొనుగోలు చేసి డీసీఎం, ట్రాక్టర్లలో లోడు చేసుకొని సీసీఐ కేంద్రాలకు తీసుకొస్తున్నారు. అలా వచ్చిన వాహనాలను ప్రత్యేక లైన్‌లో పెట్టుకుని తేమ శాతంతో సంబంధ లేకుండా తూకం వేయిస్తున్నారు. ఆ సమయంలో పత్తి పంట సాగుచేయని భూమి పట్టా కలిగిన వ్యక్తిని తీసుకొచ్చి అతనిడికి క్వింటాల్‌కు రూ.100 చెల్లిస్తామని చెప్పి అతని పేరుమీద పత్తి దిగుమతి చేస్తున్నారు. దీంతో నిజంగా పంట సాగుచేసిన రైతులు సీసీఐ కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచిచూస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని సీసీఐ కేంద్రాల్లో దళారులు తీసుకొచ్చిన పత్తిని కొనుగోలు చేయకుండా నిలిపివేయాలని పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

ఫ మునుగోడు సీసీఐ కేంద్రాల్లో

వారిదే హవా

ఫ బినామీ రైతుల పేరుమీద పత్తిని

తరలిస్తున్న వ్యాపారులు

ఫ దళారులతో కేంద్రాల సిబ్బంది

కుమ్మకై ్క యథేచ్ఛగా కొనుగోళ్లు

ఫ రైతుల పత్తిని పట్టించుకోకపోవడంతో తప్పని పడిగాపులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement