సర్వేకు ప్రజలు సహకరించాలి
కలెక్టర్, ఎస్పీ వివరాల సేకరణ
నల్లగొండ టూటౌన్ : సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఆదివారం నల్లగొండలోని కలెక్టర్, ఎస్పీ క్యాంపు కార్యాలయాలకు వెళ్లిన మున్సిపల్ సిబ్బంది, ఎన్యుమరేటర్లు కలెక్టర్ త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
మిర్యాలగూడ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఆదివారం దామరచర్ల మండలంలోని వాడపల్లిలో జరుగుతున్న సర్వేను ఆమె పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వేను పకడ్బందీగా చేపట్టాలన్నారు. అధికారులు అడిగే ప్రశ్నలకు కుటుంబసభ్యులు తప్పులు లేకుండా సమాచారం అందించాలన్నారు. అనంతరం గ్రామంలోని శ్రీమీనాక్షి అగస్త్యేశ్వరస్వామిని, లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు పూజారులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట తహసీల్దార్ జవహర్‌లాల్ ఉన్నారు.
సర్వే నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి
నల్లగొండ : ఎన్యుమరేటర్లు వారికి కేటాయించిన ఇళ్ల సమగ్ర కుటుంబ సర్వేను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఆదివారం సాయంత్రం ఆమె అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. సోమవారం నాటికి జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన లక్ష్యంలో 30 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. డాక్యుమెంట్ల కోసం ఎన్యుమరేటర్లు ప్రజలను బలవంతం చేయవద్దన్నారు. సబ్ కలెక్టర్, ఆర్డీఓలు రోజూ మండలాల వారీగా సమీక్ష నిర్వహించి సర్వేను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment