గొల్ల, కుర్మలను సంచార జాతులుగా గుర్తించాలి
మునుగోడు: గొల్ల, కుర్మలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం సంచార జాతులుగా గుర్తించి, ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, బీఆర్‌ఎస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ క్యామ మల్లేష్ కోరారు. మంగళవారం మునుగోడులోని బస్టాండ్ ఆవరణలో కుర్మ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన కొమురయ్య పేరును తెలంగాణలోని ఏదో ఒక జిల్లాకు పెట్టాలన్నారు. అగ్రకులాల నేతలు బీసీలను రాజకీయంగా అణచివేతకు గురిచేస్తున్నారని, బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం పదవులు అనభవిస్తున్న నేతలు గొల్లకుర్మల ఓట్లతో గెలుపొంది వారి విగ్రహాల ఆవిష్కరణకు వచ్చే సమయం కూడా ఇవ్వడం లేదన్నారు. కొమురయ్య కేవలం కులానికి మాత్రమే కాదని తెలంగాణ జాతికి నాయకుడన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి రెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొరిగి నర్సింహ, కుండే వెంకటేష్, మందుల సత్యం, రావుల ఐలయ్య, బండారి శంకర్, శ్రీను, కాలిన మల్లేష్ పాల్గొన్నారు.
ఫ బీసీ సంక్షేమ సంఘం జాతీయ
అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
Comments
Please login to add a commentAdd a comment