మద్దతు ధర పొందాలి
హాలియా: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర, బోనస్ పొందాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కొత్తపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో హాలియా వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. ఇప్పటికే జిల్లాలో 68,000వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, మొత్తం 340 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో సన్నరకం ధాన్యం కోసం 80 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం హాలియాలో చేపట్టిన సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఆమె వెంట డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, మిల్లర్స్ చిట్టిప్రోలు యాదగిరి, నాయకులు కాకునూరి నారాయణ గౌడ్, నాగిరెడ్డి, కమిషనర్ రామదుర్గారెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment