కలగణన సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
త్రిపురారం: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కలగణన సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం నిడమనూరు మండలంలో పర్యటించి నిడమనూరు, తుమ్మడం, రాజన్నగూడెం, వల్లభాపురం గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. సూపర్ వైజర్లు వారి పరిధిలోని గ్రామాల వారీగా ఇళ్ల జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ.. సర్వే నిర్వహిస్తున్న సమాచారాన్ని ముందే ప్రజలకు తెలియజేస్తే సిద్ధంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ చారి, ఎంపీడీఓ వెంకటేశం, స్పెషల్ అధికారి కృష్ణవేణి, తదితర అధికారులు పాల్గొన్నారు.
పలువురు సర్వే సిబ్బంది తొలగింపు
నిడమనూరు మండలంలో సర్వే చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పలువురు సిబ్బందిని మార్చాలని తహసీల్ధార్ కృష్ణ చారి, ఎంపీడీఓ వెంకటేశం, స్పెషల్ అధికారి క్రిష్ణవేణిని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. తుమ్మడంలో సర్వే సూపర్‌వైజర్ శ్రీనివాస్ పనితీరు సరిగా లేకపోవడంతో అతడిని మార్చాలని, రెమ్యునరేషన్ నిలిపి వేయాలన్నారు. రాజన్నగూడెంలో ఎన్యుమరేటర్ కుటుంబ యజమానుల నుంచి సమాచార సేకరణలో ఇబ్బంది పడుతున్నారని వారికి మరోసారి అవగాహన కల్పించాలన్నారు. వల్లభాపురం గ్రామంలో తక్కువ ఇళ్లను సర్వే చేయడంతో పంచాయతీ కార్యదర్శి మోహన్‌ను మందలించారు.
కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లుకు తరలించాలి
త్రిపురారం: కొనుగోలు చేసి కాంటా వేసిన ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నిడమనూరు మండలంలోని ఊట్కూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆమె వెంట పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ దుర్గారెడ్డి, ఎంపీడీఓ సుజాత ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment