పత్తి మిల్లు వద్ద రైతుల ఆందోళన
మర్రిగూడ: మండల పరిధిలోని యరగండ్లపల్లిలో గల శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆగ్రో పత్తి మిల్లు వద్ద పత్తి కొనుగోళ్లు నిలిపివేశారని మంగళవారం రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పత్తి మిల్లు నుంచి రోజుకు 1200– 1500 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధనలు ఉన్నాయని సీసీఐ అధికా రులు పేర్కొనడం బాధాకరమన్నారు. దళారుల పత్తిని కొనుగోలు చేసి రైతులకు నిబంధనలను పెట్టడం సరికాదన్నారు. రోజుల తరబడి రైతులు సీసీఐల వద్ద పడిగాపులు కాస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం లేదన్నారు. గత మూడు రోజులుగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో సమస్యలు తలెత్తినట్లు పేర్కొన్నారు. సీపీఐ మండల సహాయ కార్యదర్శి బూడిద సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే నిబంధనలు ఎత్తివేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో ట్రాఫిక్ జాం కావడంతో మర్రిగూడ పోలీసులు అక్కడకు చేరుకుని, రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment