మిర్యాలగూడ: మిర్యాలగూడలో ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరుగుతున్నాయని, ఇప్పటివరకు 2.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైస్ మిల్లుల వద్ద అన్ని రకాల ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలన్నారు. రైతులను ఇబ్బంది పెడితే రైస్ మిల్లులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ తదితర ప్రాంతాలకు చెందిన రైతులు మిర్యాలగూడలో ధాన్యం విక్రయించేందుకు ఆయా మండలాల్లోని వ్యవసాయశాఖ అధికారుల ద్వారా టోకెన్లు పొందాలన్నారు. ప్రతిరోజు రైస్ మిల్లులను తనిఖీ చేసి మద్దతు ధర విషయంలో రైతుల ద్వారా తెలుసుకుంటామన్నారు. రైతులు మిల్లుల వద్ద ధాన్యానికి లభించిన రేటు నచ్చితేనే అమ్మాలని లేకుంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి మద్దతు ధరతోపాటు క్వింటాకు రూ.500 బోనస్ పొందాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ హరిబాబు పాల్గొన్నారు.
ఫ మిర్యాలగూడ సబ్ కలెక్టర్
నారాయణ్‌అమిత్
Comments
Please login to add a commentAdd a comment