రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
మిర్యాలగూడ: ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శరత్‌చంద్రపవార్ హెచ్చరించారు. మంగళవారం మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో పలు రైస్ మిల్లులను ఆయన సందర్శించారు. మిల్లు వద్దకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మిల్లర్లు సూచించారు. ఏరోజుకారోజు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైతులను వేచి ఉండేలా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలు విషయంలో రైతులను మోసం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు సహకరించాలని కోరారు. అనంతరం స్థానిక ఎంవీఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు. ఆయన వెంట డీఎస్పీ రాజశేఖర్‌రాజు, సీఐ వీరబాబు, ఎస్‌ఐలు కృష్ణయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇతర రాష్ట్రాల ధాన్యాన్ని
తెలంగాణలోకి అనుమతించబోం
మిర్యాలగూడ: ఖరీఫ్ సీజన్‌లో ఇతర రాష్ట్రాల ధాన్యాన్ని తెలంగాణలోకి అనుమతించబోమని ఎస్పీ శరత్‌చంద్రపవార్ అన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు అయిన దామరచర్ల మండలంలోని వాడపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఆయన పరిశీలించి మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర రాష్ట్రాల ధాన్యం తెలంగాణలోకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఎస్పీ రాజశేఖర్‌రాజు, ఎస్‌ఐ హరికృష్ణ తదితరులు ఉన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్రపవార్
Comments
Please login to add a commentAdd a comment