ప్రభుత్వ బడిలో క్రీడా సామగ్రి దహనం చేసిన దుండగులు
నల్లగొండ క్రైం: నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ రోడ్డులో గల జేబీఎస్ ప్రభుత్వ పాఠశాల మద్యం, గంజాయి బ్యాచ్‌కు అడ్డాగా మారింది. రోజూ ఉదయం పాఠశాల గేటు తీయగానే మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాల గోడ దూకి రూ.60 వేల విలువైన క్రీడా సామగ్రిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. పాఠశాలలో క్రీడా సామగ్రి ఉండటం వల్ల సాయంత్రం వరకు విద్యార్థులు అక్కడే ఆడుతున్నారు. ఇది గంజాయి బ్యాచ్‌కు అవరోధంగా మారింది. విద్యార్థులు స్కూల్ సమయం అయిపోగానే ఇంటికి పోతే ఇటువైపు కన్నెత్తి చూడరని క్రీడా సామగ్రిని దగ్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆరు నెలల క్రితం కూడా ఇదేవిధంగా క్రీడా సామగ్రిని దహనం చేశారు. అప్పట్లో భయపడిన పాఠశాల ఉపాధ్యాయులు ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఇటీవల హైస్కూల్ సిబ్బంది మారడంతో గతంలో కూడా ఇలాగే జరిగిందని విద్యార్థులు ఉపాధ్యాయులకు చెప్పారు. దీంతో సోమవారం వన్‌టౌన్ పోలీసులకు అనుమానితుల వివరాలతో ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు.
అసభ్యంగా ప్రవర్తిస్తున్న గంజాయి బ్యాచ్..
హైస్కూల్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో గంజాయి బ్యాచ్ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఉపాధ్యాయులను సైతం సైగలతో బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుల నిఘా పెంచాలని విద్యార్థినులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పోలీసుల అదుపులో అనుమానితులు
Comments
Please login to add a commentAdd a comment