నేతన్నలకు త్రిఫ్ట్ డబ్బులు వెంటనే ఇవ్వాలి
భూదాన్‌పోచంపల్లి: చేనేత కార్మికుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిన త్రిఫ్ట్ డబ్బులను డ్రా చేసుకొనేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ రీజినల్ డైరెక్టర్ పద్మ అన్నారు. సోమవారం చేనేత జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ ఆదేశాల మేరకు ఆమె పోచంపల్లిని సందర్శించారు. చేనేత సహకార సంఘం, చేనేత కార్మికుల సంఘంలో చేనేత కార్మికులతో సమావేశమై వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాగా గతంలో ముద్ర రుణాలు తీసుకొని బకాయిలు ఉన్న చేనేత కార్మికులకు త్రిఫ్ట్ డబ్బులు డ్రా చేసుకోకుండా బ్యాంకర్లు నిలుపుదల చేశారని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఆమె స్పందిస్తూ స్థానిక ఎస్‌బీఐ, ఏపీజీవీబీ, కెనరా బ్యాంకులను సందర్శించి ఆయా బ్యాంకుల మేనేజర్లతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్రిఫ్ట్ డబ్బులు పట్టుకోవడానికి వీలులేదని, వెంటనే డబ్బులు డ్రా చేసుకొనే అవకాశం కల్పించాలని కోరారు. మొదటిసారిగా పోచంపల్లికి వచ్చిన ఆమెకు పద్మశాలీ కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, పాలకవర్గం శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళిశాఖ ఇన్‌చార్జి ఏడీ శ్రీనివాస్, చేనేత సహకార సంఘం మేనేజర్ రుద్ర అంజనేయులు, చింతకింది రమేశ్, ఏలే భిక్షపతి, చేనేత కార్మిక సంఘం పాలకవర్గం భరత్ భూషణ్, బొమ్మ హరిశంకర్, బిట్ల గణేశ్, రుద్ర సూర్యప్రకాశ్, పొట్టబత్తిని వేణు, కటకం శ్యామ్, కూరపాటి భాస్కర్, గుండేటి శివరాజ్, గుండు రాజేశ్వరీ, గుర్రం హేమలత తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర చేనేత జౌళి శాఖ రీజినల్ డైరెక్టర్ పద్మ
Comments
Please login to add a commentAdd a comment