వేధింపులు తాళలేక ల్యాబ్‌టెక్నీషియన్ ఆత్మహత్య
సూర్యాపేటటౌన్: ఆస్పత్రి సిబ్బంది వేధింపులు భరించలేక లయన్స్ క్లబ్ కంటి ఆస్పత్రి ల్యాబ్ టెక్నీషియన్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు, భర్త తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చంద్రన్నకుంటకు చెందిన కొత్తపల్లి కిరణ్మయి(30) జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ కంటి ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ కం కంప్యూటర్ ఆపరేటర్‌గా మూడు నెలలుగా పనిచేస్తోంది. ఆమె భర్త ప్రవీణ్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. లయన్స్ క్లబ్ కంటి ఆస్పత్రి ఇన్‌చార్జి పవన్ రెండు నెలలుగా కిరణ్మయిని లైంగికంగా, మానసికంగా వేధిస్తుండడంతో పాటు ఏ పని సక్రమంగా చేయడంలేదని ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేక కిరణ్మయి సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు కిరణ్మయి భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆయన ఇంటికి వచ్చేసరికి కిరణ్మయి ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. కిరణ్మయి మృతికి కారణమైన లయన్స్ క్లబ్ కంటి ఆస్పత్రి ఇన్‌చార్జి పవన్‌తో పాటు మరో ముగ్గురు ఆస్పత్రి సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు వెళ్లేది లేదని రాత్రి వరకు అక్కడే కూర్చున్నారు. కాగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని సూర్యాపేట పట్టణ పోలీసులు తెలిపారు.
న్యాయం చేయాలని మృతురాలి
బంధువుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment