షార్ట్ సర్క్యూట్‌తో ఫర్నీచర్ షాపు దగ్ధం
భూదాన్‌పోచంపల్లి: షార్ట్ సర్క్యూట్‌తో ఫర్నీచర్ షాపు దగ్ధమైంది. ఈ ఘటన పోచంపల్లి పట్టణ కేంద్రంలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన ధ్యానమైన జంగయ్య స్థానికంగా రెండు షట్టర్లలో శ్రీసాయి మెటల్ అండ్ ఫర్నీచర్ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం 10 గంటలకు షాపు తెరిచాడు. ఫర్నీచర్ ఉన్న షాపులో షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు స్థానిక పెట్రోల్ బంక్‌ల నుంచి కార్బన్ డై ఆకై ్సడ్ సిలిండర్లు తెచ్చి మంటలార్పేందుకు యత్నించారు. చౌటుప్పల్‌లోని ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలార్పారు. అప్పటికే షాపులోని మంచాలు, స్పాంజ్ బెడ్‌లు, బీరువాలు, ప్లాస్టిక్ కుర్చీలు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. రూ.3లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు పేర్కొన్నాడు. విషయం తెలుసుకొన్న తహసీల్దార్ మహేందర్‌రెడ్డి, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకొన్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం చెల్లించి ఆదుకోవాలని బాఽధితుడు జంగయ్య అధికారులను కోరారు.
కాలిబూడిదమైన షాపు
కాలిబూడిదైన సామగ్రి
రేవనపల్లిలో జ్యువెల్లరీ షాపులో..
పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రేవనపల్లిలో గల మణికంఠ జ్యువెల్లరీ షాపులో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాపు యజమాని అఖిల్‌చారి వెండి వస్తువులను కరిగించేందుకు గాను షాపులో ఉన్న చిన్న సిలిండర్‌ను వెలిగించాడు. సిలిండర్ పైపు చెడిపోయి ఉండటంతో ఒక్కసారిగా మంటలు సిలిండర్‌కు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన అఖిల్‌చారి ఇరుగుపొరుగు వారిని పిలిచాడు. వారు సిలిండర్‌ను బయటకు విసిరివేయడంతో పెనుప్రమాదం తప్పింది. షాపులోని రెండు డెస్క్ టేబుల్స్, కుర్చీలు, కార్పెట్, షాపు షోకేజ్ గ్లాస్ పగిలిపోయింది. సుమారు రూ.30వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment