తిప్పర్తి: అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న ముగ్గురిని సోమవారం పోలీసులు రిమాండ్కు తరలించారు. తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దసూరారం గ్రామానికి చెందిన కర్ర రాములమ్మకు 2.37 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో నుంచి 33గుంటల భూమిని అమ్మకానికి పెట్టగా.. అదే గ్రామానికి చెందిన రాములమ్మ వరసకు అన్న అయిన తల్లమల్ల హుస్సేన్, అతడి కుమారులు రాజు, విజయ్ కొనుగోలు చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. గత నెల 17వ తేదీన 33 గుంటలకు మాత్రమే డబ్బులు చెల్లించి మోసపూరితంగా మొత్తం 2.37 ఎకరాల భూమిని వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రాములమ్మకు చదువు రాకపోవడంతో ఆమె సమీప బంధువు పాసుపుస్తకం పరిశీలించగా.. భూమి మొత్తం రిజిస్రేటషన్ చేయించుకున్నట్లు తెలియడంతో ఈ నెల 18న రాములమ్మ తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తిప్పర్తి ఎస్ఐ సాయిప్రశాంత్ విచారణ చేసి హుస్సేన్, అతడి కుమారులు రాజు, విజయ్ను రిమాండ్కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment