పత్తి మిల్లులో అగ్నిప్రమాదం
ఆత్మకూరు(ఎం): షార్ట్ సర్క్యూట్ కారణంగా పత్తి మిల్లులో మంటలు చెలరేగి పత్తి దగ్ధమైంది. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో సోమవారం ఉదయం జరిగింది. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని శ్రీసిద్ధేశ్వర కాటన్ మిల్లులో ఈ నెల 4వ తేదీన సీపీఐ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు రైతుల నుంచి సుమారు 30వేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. సీసీఐ కేంద్రంలో పత్తి నిల్వ చేసిన షెడ్డు కింద షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పత్తిపై పడ్డాయి. దీంతో దట్టమైన పొగలు ఏర్పడి మంటలు వ్యాపించాయి. అక్కడే పనిచేసే కూలీలు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఫైరింజన్‌కు సమాచారం ఇవ్వడంతో మోత్కూరు నుంచి ఫైరింజన్ వచ్చి మంటలను పూర్తిగా ఆర్పేశారు. ఈ ఘటనలో 2వేల క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. ఘటనా స్థలాన్ని తహసీల్దార్ వి. రవికుమార్, ఎస్‌ఐ ఎస్. కృష్ణయ్య పరిశీలించారు.
● రైతుల నుంచి సేకరించిన
2వేల క్వింటాళ్ల పత్తి దగ్ధం
Comments
Please login to add a commentAdd a comment