డ్రమ్ సీడర్ పద్ధతితో అధిక దిగుబడులు
పెన్‌పహాడ్: డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగు చేస్తే రైతులు అధిక దిగుబడులు పొందవచ్చని కేవీకే శాస్త్రవేత్త ఎ. కిరణ్, ప్రాణాధార సంస్థ శాస్త్రవేత్త కె. పుండరీకాంక్షుడులు అన్నారు. సోమవారం పెన్‌పహాడ్ మండల పరిధిలోని దూపహాడ్, లింగాల గ్రామాల్లో డ్రమ్ సీడర్ విధానం ద్వారా పండించిన వరి పంటను వారు పరిశీలించారు. అనంతరం వరిలో డ్రమ్ సీడర్ విధానం గురించి రైతులకు వివరించారు. బూమ్ స్ప్రేయర్ ద్వారా కలుపు మందులు, రసాయనాలు పిచికారీ చేయవచ్చన్నారు. కార్యక్రమంలో రైతులు అరవింద్, వీరయ్య, బచ్చు శ్రీను, అంజయ్య, సత్యనారాయణ, వ్యవసాయ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment