సాగులో శిక్షణ, అవగాహన
గరిడేపల్లి: అగ్రికల్చర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు గ్రామాల్లో పర్యటించి రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లిలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. అక్టోబర్ 16వ తేదీన 58మంది విద్యార్థినులు గడ్డిపల్లి కేవీకేకు వచ్చారు. వీరికి పది రోజులకు ఒకసారి కేవీకేలో వ్యవసాయ పద్ధతులపై శిక్షణనందిస్తూ వారికి తెలిసిన అంశాలను క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించేలా చూస్తున్నారు. మొత్తం 58మంది విద్యార్థులు 8 బ్యాచ్‌లుగా ఏర్పడి 90రోజుల పాటు కేవీకే పరిధిలోని దత్తత గ్రామాలైన గడ్డిపల్లి, మర్రికుంట, పొనుగోడు, దూపహాడ్, కీతవారిగూడెం, గరిడేపల్లి విద్యార్థినులు పర్యటించి భూసార పరీక్షలు, ఎరువుల వాడకం, చీడపీడలు, కలుపు నివారణ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, జీవ ఎరువుల తయారీ, నీటి యాజమాన్యం గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామ కూడళ్ల వద్ద గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక కార్యక్రమం ద్వారా గ్రామ జనాభా, పంటల విధానం, రైతుల ఆర్థిక స్థితిగతులు, గ్రామ భౌగోళిక స్వరూపం వంటి అంశాలపై చిత్రపటాలతో అవగాహన కల్పిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు.
కేవీకేలో శిక్షణ పొందుతూ
క్షేత్రస్థాయిలో రైతులతో మమేకం
వ్యవసాయ పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తున్న
అగ్రికల్చర్ విద్యార్థినులు
Comments
Please login to add a commentAdd a comment