యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు అధికంగా వచ్చారు. ఉదయం నుంచే కొండ దిగువన ఉన్న వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. కొండ పైన ధర్మ దర్శనానికి రెండున్నర గంటలు, వీఐపీ దర్శనానికి 45నిమిషాల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామి వారిని 30వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.44,70,794 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
చెర్వుగట్టులో ప్రత్యేక పూజలు
నార్కట్‌పల్లి: కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. గట్టు పైన, ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జాం కావడంతో భక్తులు ఇబ్బందులు పడారు. ఆయా పూజల్లో ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, సీనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కిటకిటలాడిన ఆలయ పరిసరాలు
Comments
Please login to add a commentAdd a comment