శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థాన సహాయ కార్యనిర్వహణాధికారులకు, పర్యవేక్షకులకు పోస్టింగ్‌లు కేటాయిస్తూ ఇన్చార్జ్ ఈఓ ఇ.చంద్రశేఖరరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సహాయ కార్యనిర్వహణాధికారి ఐఎన్వీ మోహన్‌కు కర్నూలు సమాచార కేంద్రం పర్యవేక్షణ, శ్రీశైల దేవస్థాన అనుబంధ ఆలయాల పర్యవేక్షణ, అభివృద్ధి విధులు కేటాయించారు. ఏఈఓ మల్లికార్జునరెడ్డికి పారిశుధ్య విభాగం, ఎం.హరిదాసుకు గోశాల, విభూతి విభాగం, జి.స్వాములుకు ఆర్జితసేవా కౌంటర్లు, డొనేషన్ కౌంటర్, క్యూకాంప్లెక్స్ పర్యవేక్షణ విధులు కేటాయించారు. పర్యవేక్షకురాలు కె.సాయికుమారికి సిద్దవటం దేవస్థానం పర్యవేక్షణ, జి.రవికి దేవస్థానం వైద్యశాల, ధర్మప్రచారం, శివసేవకుల పర్యవేక్షణ, ఎం.మల్లికార్జునకు గోశాల, విభూతి విభాగం కేటాయించారు. ఎ.సర్వేశ్వరుడికి డ్రాఫ్ట్స్‌మెన్ విధులు, సీనియర్ అసిస్టెంట్ ఇ.మల్లిక్రాజాకు లీగల్, సీ5 సీటు కేటాయించారు. కేటాయించిన విధుల్లో తక్షణమే చేరాలని ఈఓ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment