ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 2,329, ప్రాథమికోన్నత పాఠశాలలు 860, ఉన్నత పాఠశాలలు 1,010 ఉన్నాయి. ఈ స్కూళ్లలో సుమారు 7,96,195 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి బోధన చేస్తున్న ఉపాధ్యాయులు సుమారు 26,164 మంది ఉన్నారు. గత ప్రభుత్వం డీఎస్సీ ద్వారా జిల్లాలో 1,693 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా, ఎన్నికల కోడ్ తదితర కారణాలతో పరీక్షలను వాయిదా వేశారు. ఐదునెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు డీఎస్సీ ద్వారా ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది డిసెంబరు వరకు పదవీవిరణ చేసే టీచర్ల ఖాళీలను కలిపి 2,645 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో ఎస్‌జీటీ 1,731, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 816, మున్సిపల్ స్కూళ్లలో వివిధ కేటగిరిలకు సంబంధించిన పోస్టులు 98 ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment