ధోబీఘాట్ల నిర్మాణానికి చర్యలు
కర్నూలు(అర్బన్)/సెంట్రల్: రజక వృత్తిపై ఆధారపడిన 60 రజక కుటుంబాలకు ఒక ధోబీఘాట్ చొప్పున నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రజక వృత్తిదారుల వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ సావిత్రమ్మ తెలిపారు. సోమవారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహానికి వచ్చిన ఆమెకు రజక సంఘాల నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రజకుల అభివృద్థి కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. అనంతరం నగరంలోని పలు ధోబీఘాట్లను పరిశీలించారు. చైర్‌పర్సన్ సావిత్రమ్మను కలిసిన వారిలో రజక, ప్రజా సంఘాల నాయకులు సి.గురుశేఖర్, శ్రీరాములు, నాగరాజు, రాంబాబు, మధు, శ్రీను, లక్ష్మన్న, మురళీనాయుడు, లోకేశ్వరయ్య, కోటి యాదవ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
రజక కార్పొరేషన్ చైర్‌పర్సన్ సావిత్రమ్మ
Comments
Please login to add a commentAdd a comment