ప్రజా సమస్యలపై దృష్టి సారించండి
నంద్యాల: ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి జేసీ అర్జీలను స్వీకరించి మాట్లాడారు. పీజీఆర్‌ఎస్‌లో ఇంకా 774 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇందులో రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, సివిల్ సప్లయ్, పోలీస్ తదితర శాఖలకు సంబంధించినవి అధికంగా ఉన్నాయని చెప్పారు. వీటి పరిష్కారానికి ఆర్డీఓలు, సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సీఎంఓ కార్యాలయ ఫిర్యాదులు సైతం 67 పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.వీటిని త్వరగా క్లియర్ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు
పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వినతుల్లో కొన్ని..
● ఈ నెల 30వ తేదీలోపు ఎన్‌పీసీఐ బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, ఈ ప్రక్రియ పూర్తికి మరికొంత సమయం ఇవ్వాలని వార్డు, గ్రామ హెల్త్ సెక్రెటరీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జేసీకి విన్నవించారు.
● తనకు బ్యాటరీ ట్రై సైకిల్ మంజూరు చేయాలని ఆత్మకూరు మండలం నల్లకాలువ గ్రామానికి చెందిన దివ్యాంగుడు వెంకటస్వామి జేసీని కోరారు.
● తన తండ్రికి 4.70 ఎకరాలు భూమి ఉందని, ఆయన మరణాంతంరం తమ్ముడొక్కడే ఆ భూమిని ఆన్‌లైన్ చేసుకొని పాసుపుస్తకం తెచ్చుకున్నారని, ఈ విషయంలో న్యాయం చేయాలని పాణ్యం మండలం భూపనపాడు గ్రామానికి చెందిన సత్యరాజ్ వినతిపత్రం అందజేశారు.
పెండింగ్‌లో 774 ఫిర్యాదులు
సత్వరం వాటి పరిష్కారానికి
చర్యలు తీసుకోవాలి
పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు
జేసీ విష్ణుచరణ్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment