ఆర్‌యూ ఇంజినీరింగ్ పరీక్షలు ప్రారంభం
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల బీటెక్ విద్యార్థులకు 3, 7 సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాలను వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్ సందర్శించి పరిశీలించారు. అనంతరం వర్సిటీ సైన్స్, ఆర్ట్స్ కళాశాలలను సందర్శించారు. తరగతులు జరుగుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. టైంటేబుల్‌ను అనుసరించి రెగ్యులర్‌గా తరగతులు జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి 224 మందికి 223 హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారని ఆర్‌యూసీఈ ప్రిన్సిపాల్ డాక్టర్ హరిప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు 74 మందికి 74 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఏడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి 167 మందికి 167 మంది, సప్లిమెంటరీ పరీక్షలకు ముగ్గురు విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. వీసీతో పాటు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విజయకుమార్ నాయుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment