ఏపీజీబీలో మూడు గ్రామీణ బ్యాంకుల విలీనం! | - | Sakshi
Sakshi News home page

ఏపీజీబీలో మూడు గ్రామీణ బ్యాంకుల విలీనం!

Published Tue, Nov 26 2024 1:39 AM | Last Updated on Tue, Nov 26 2024 1:39 AM

-

కర్నూలు(అగ్రికల్చర్‌): రాష్ట్రంలోని వివిధ గ్రామీణ బ్యాంకులు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో విలీనమవుతున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో మొత్తం నాలుగు గ్రామీణ బ్యాంకులు ఉండగా.. ఇందులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అతి పెద్ద బ్యాంకుగా ఉంది. మిగతా మూడింటిలో ఆంధ్రప్రగతి గ్రామీణ వికాస్‌ బ్యాంకు, చైతన్య గోదావరి బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకులున్నాయి. ఈ మూడు ఏపీజీబీలో విలీనం కానున్నాయి. ఈ నేపథ్యంలో కడపలో ఉన్న ఏపీజీబీ కార్యాలయాన్నే ప్రధాన కార్యాలయంగా గుర్తించాలని ఆ బ్యాంకు అధికారుల సంఘం డిమాండ్‌ చేస్తోంది. అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నందున కడపలోనే ప్రధాన కార్యాలయాన్ని కొనసాగించాలని ఆసంఘం నాయకులు కోరుతున్నారు. దక్షిణ భారత దేశంలో ఏ గ్రామీణ బ్యాంకుకు లేని విధంగా ఏపీజీబీకి కరెన్సీ చెస్ట్‌ కూడా ఉందని పేర్కొంటున్నారు. ఈ మేరకు సోమవారం ఏపీజీబీ బ్యాంకు యూనియన్‌ల ప్రతినిధులు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితను కలసి విలీనమవుతున్న గ్రామీణ బ్యాంకుల ప్రధాన కార్యాలయాన్ని కడపలో కొనసాగించే విధంగా చూడాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

త్వరలో కార్యరూపం దాల్చే అవకాశం

కడపలోనే ప్రధాన కార్యాలయం

కొనసాగించాలని ఉద్యోగులు డిమాండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement